మనసిచ్చి చూడు - 8

  • 1.8k
  • 783

                 మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ తనకి ఆరోగ్యం అసలు బాలేదు.అంటే ఎక్కువగా దేని గురించో ఆలోచించడం వల్ల చాలా సఫర్ అవుతున్నాట్టు ఉన్నారు అందుకే ఇంత ఎక్కువగా జ్వరం కూడా రావడం జరిగింది.ముందు కొంచెం కోలుకొన్న తరువాత తన మానసిక పరిస్థితి తెలుసుకొండి.అలాగే డాక్టర్ ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్లచ్చు...??ఇంకో రెండు రోజుల తరువాత డిస్చార్జ్ చేస్తాం.అలాగే డాక్టర్ అని చెప్పి పక్కకు వెళ్లి వాళ్ల అమ్మ గారికి కాల్ చేసి విషయం అంత చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు.ఆమె బాగా ఆలోచించి లేదు రా మీ నాన్న గారికి అక్కడ పడదు అని చెప్పింది.నువ్వే దగ్గర ఉండి చూసుకో అంది.అమ్మా అన్నాడు.ఉంటాను జాగ్రత్త రా సమీరా అని కాల్ కట్ చేసింది.సాయంత్రం అవుతుంది ఇంత వరకు తను ఏమీ తినలేదు కదా