మనసిచ్చి చూడు - 4

  • 1.9k
  • 1k

మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవరు అండీ అన్నాడు చాలా కోపంగా....??? నేను సమీరా..... ️ సమీరా.....చెప్పు ఏంటి,ఎందుకు కాల్ చేశావు. అది అది....??? ఇలా లేట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు..??? మీరు ఇంటికి రండి నేను కొంచెం బయటకు వెళ్లాలి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. ఏంటి నాటకాలా.... నేను ఆఫీసులో ఉంటే ఇప్పుడు నీకోసం రావాలా....?? వస్తే ఎమ్ అవుతుంది రాకూడదా.....?? చూడు అవన్ని జరగని పనులు ఊరికే నా మీద ఆశలు పెట్టుకోవద్దు.నీకు ఎమ్ కావాలి అన్న కొనుక్కో నా కార్డ్స్ ఇస్తాను,నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు, ఇంకోసారి ఫోన్ చేయకు. నా దగ్గర డబ్బులు లేక మీకు కాల్ చేశాను అనుకుంటున్నారా అండీ....?? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయం మీకు గుర్తు లేదు అనుకుంటా.... మీ వల్లే నా లైఫ్ ఇలా అయింది. మీకు ప్రేమించడం ఒక్కటే రాదు అనుకున్నాను,కానీ కనీసం ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం కూడా రాదు అని