అరె ఏమైందీ? - 17

  • 899
  • 450

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ దీని పేరెంట్స్ కి విషయం తెలుసంటారా? ఇది చెప్పివుంటుందా? చెప్పివుంటే ఒక మగాడితో పెళ్లికాని పిల్ల ఇదిలా ఉండడానికి వాళ్లెలా ఒప్పుకుని వుంటారు? ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఇలాగ చెయ్యాల్సి వస్తూ ఉంటుంది. అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? సినిమాల్లో చూసావుగా ఎలా తెగించి నటిస్తున్నారో. అది వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండానే ఉంటుందా? చిదంబరం అన్నాడు. అయినా మనకి అదంతా అనవసరం. మనపని మనకి పూర్తి అయితే చాలు. ముఖ్యంగా ఆ అమ్మాయిని మన కోడలు చేసుకుందామనుకోవడం వల్లే అది మనల్ని సాధిస్తూంది. ఆ విషయం మనం విడిచిపెట్టేస్తే అది మనల్ని వదిలేస్తుందనుకుంటా. సాలోచనగా అంది శకుంతల. మన పరిస్థితులన్నీ మర్చిపోయి నువ్వలా ఎలా మాట్లాడతావు? మనం పీకల్లోతు అప్పుల్లో వున్నాం. ఆ సర్వేశ్వరం సహాయం లేకపోతె అప్పులవాళ్ళు మనల్ని రోడ్డుమీద పడేస్తారు.