పెళుసు బారుతున్న బంధాలు

  • 3.5k
  • 1
  • 972

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టిల్లు. ఈ వ్యవస్థ దేశానికి ఆత్మ వంటిది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, పిల్లలు, తాత, బామ్మలు..ఇలా మూడు, నాలుగు తరాలకు సంబంధించిన వారందరూ కలిసి హాయిగా జీవించేవారు. వారి మధ్య బలమైన, ఉన్నతమైన బంధాలు ఉండేవి. దీనివల్ల కుటుంబానికి ఒక రకమైన భద్రత లభించేది. గతంలో పెద్దగా ఆస్తులు, ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ మనుషులు చక్కని ఆప్యాయత, అనుబంధాలతో ఉన్నంతలోనే తృప్తిగా గడిపారు. ‘వసుధైక కుటుంబం’ అనాదికాలం నుంచి భారతీయ కుటుంబ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆధునిక మకిలిని ఒంటబట్టించుకుని మన దేశ సంస్కృతి తాలూకు ఔన్నత్యానికి భంగకరంగా ప్రవర్తిస్తున్నాం. ప్రగతి పేరిట ప్రవర్తన, ఆధునికత పేరిట అపసవ్య విధానాలతో తరతరాల మన సంస్కృతికి తూట్లు పొడుస్తూ, బంధాలను బలహీనం చేసుకుంటున్నాం.పెరుగుతున్న అగాథం..ప్రపంచీకరణ ప్రయాణంలో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. జారిపోతున్న బంధాలతో ఆధునిక