రాఖీ/ రక్షాబంధన్‌అగస్టు నెల వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఏ రోజు వచ్చిందా అని కేలండర్ తిరగేస్తారు. రక్తసంబంధం ఉన్నా లేకున్నా అన్నాచెల్లెళ్లుగా, అక్కాతమ్ముళ్లుగా బంధాలని పంచి పెంచే పండుగే రాఖీ! కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది. నువ్వే నాకు రక్ష.. ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, అప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలి.. అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరీ తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షా బంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షా బంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి అప్యాయతా కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి. పురాణాల్లో రాఖీ...రాఖీ పండుగ ఈనాటిది కాదు. దీని మూలం మహాభారతంలోనే ఉంది! శ్రీకృష్ణునికి శ్రుతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు "శిశుపాలుడు" అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు. ఎవరి చేయి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో, అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని