నిష్కల్మష మయిన స్నేహం, విలువ

  • 4k
  • 1
  • 1.3k

నిష్కల్మష మయిన స్నేహం, విలువ –ప్రేమ,అంతర్గత విలువ –ప్రతి ఫలాపేక్ష లేని స్నేహంనేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. నా భార్య పెద్ద గా కేక పెట్టి ఎంత సేపు ఆ న్యూస్ పేపర్ చదువుతారు. మన పాప అన్నం తినడానికి పేచీ పెడుతోంది. దానికి నచ్చ జెప్పి అన్నం తినిపిస్తారా అని అడిగింది. నేను న్యూస్ పేపర్ ప్రక్కన పెట్టి వచ్చి చూసే సరికి పాప కళ్ళనిండా నీళ్ళు. దాని ముందు అన్నం కంచం. మా పాప పేరు సింధు అప్పుడే ఎనిమిదవ సంవత్సరం వచ్చింది. ఆ వయసు వాళ్ళకు ఉండే తెలివి తేటల కంటే పాపకు కొంచెం తెలివి తేటలు ఎక్కువే. నేను అన్నం కంచం చేతిలోకి తీసుకుని సింధూ మీ నాన్న కోసం రెండు ముద్దలు అన్నం ఎందుకు తినవు అని ముద్దుగా అడిగాను. నువ్వు తినకపోతే మీ అమ్మ గట్టిగా కోప్పడుతుంది అన్నాను. నాకు ఇష్టం లేకపోయినా