తల్లిదండ్రులను గౌరవించాలి

  • 3.9k
  • 1
  • 1.3k

ఒక గ్రామంలో, ఒక వృద్ధుడు తన కొడుకు మరియు కోడలుతో కలిసి ఉంటున్నాడు. కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడు ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఒకప్పుడు చాలా యవ్వనం తో ఉండేవాడు, ఇప్పుడు ముసలివాడు అవ్వడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు. కుంటుతూ కర్ర చేతిలో ఉంటూనే నడిచేవాడు. ముఖం అంత ముడుతలతో నిండి పోయింది , ఏదో ఒకవిధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటంటే, సాయంత్రం భోజనం తినేటప్పుడు, కుటుంబం మొత్తం కలిసి టేబుల్ వద్ద తినేది. ఒక రోజు సాయంత్రం, అందరు భోజనం తినడానికి కూర్చున్నప్పుడు. కొడుకు ఆఫీసు నుండి వచ్చాడు, అతను చాలా ఆకలితో ఉన్నాడు, కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు మరియు కోడలు మరియు అతని కుమారులలో ఒకరు కూడా కలిసి తినడం ప్రారంభించారు. వృధుడు చేతితో ప్లేట్ పైకి తీయబోతుంటే ,పళ్లెం చేయి నుంచి జారీ పళ్ళెంలో