చిన్నారుల కోసం చిట్టి కథలు...

  • 3.2k
  • 1
  • 1.2k

సాధారణంగా చిన్న పిల్లలను నిద్రపుచ్చేందుకు తల్లిదండ్రులు కొన్ని కథలు చెబుతుంటారు. కొన్ని కథలు రాజులకు సంబంధించినవి ఉంటే మరికొన్ని నీతి కథలుంటాయి. ఇలాంటి కథలను పిల్లలు ఎంతో శ్రద్ధగా వింటారు. నీతి కథలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి. జీవితంలో మనిషి ఎలా ఉండాలో కూడా ఈ నీతికథలు నేర్పుతాయి. కొన్ని కథల్లో నీతితో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఇలాంటి మంచి సందేశం ఉన్న కథలు చాలా శక్తివంతమైనవి అని చెప్పుకోవచ్చు.సంతోషం ఆనందం కలగాలంటే...అనగనగా ఓ గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు. ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరు. ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా విసిగి వేశారిపోయారు. ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయమై ఫిర్యాదు చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇక ఆయన నోరు తెరిస్తే చాలు... విషపూరితమైన మాటలే