ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 19

  • 4.3k
  • 1
  • 1.7k

అలా రోజులు గడిచిపోతూ పార్టీ జరిగే రోజు రానే వచ్చింది..... ఆరోజు మధ్యాహ్నం నుంచి అందర్నీ ఇంటికి వెళ్లిపోమని చెప్పి షార్ప్ ఫిక్స్ కల్లా పార్టీ జరిగే హోటల్ కి రమ్మని కృష్ణ అందరికీ ప్యూన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో అందరూ సంతోషంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఎవరి హాస్టల్స్ కి వాళ్ళు ఎవరి ఫ్లాట్స్ వాళ్ళు వెళ్లిపోయారు......@@@@@@సీత కూడా ఫ్లాట్ కి వెళ్ళాక “ బావ ఈ పార్టీ నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకే కదా??? “ అని ఏదో రహస్యం ఛేదించిన దానిలా అడిగిందిరామ్ నవ్వుతూ అవును అనగానే “ అయితే ఈ రోజు నిన్ను బాగా పొగుడుతారా??? “ అని ఎక్సైటింగ్ గా అడిగిందిరామ్ సీత నెత్తి మీద మూడుతూ “ ఇదేమైనా సభా కార్యక్రమం అనుకున్నావా నన్ను పొగడటానికి??? పార్టీ జస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు అభినందించి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు అంతే.....