ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 12

  • 4.7k
  • 1
  • 2.3k

సీత చిరు కోపంగా సుధ గారి వైపు చూస్తే సుధ గారు అంతకంటే సీరియస్ గా సీతని చూడటంతో సీత ముడుచుకుపోయి “ అందుకే అత్త అమ్మని ఉండమని అడగలేదు ఇలా చూపులతోనే నన్ను బెదరగొట్టేస్తుంది..... సరేలే అత్త అప్పుడప్పుడు వస్తూ ఉండండి.... “ అని అందరినీ కన్నీళ్ళతోనే సాగనంపి రామ్ తో పాటు ఫ్లాట్ కి వస్తుంది@@@@@@@డల్ గా సోఫాలో కూర్చొని ఉన్న సీతని చూసి రామ్ నవ్వుతూ తన పక్కన కూర్చొని సీత చేతిని తన చేతిలోకి తీసుకొని “ ఎందుకే అలా డల్ అయిపోతున్నావు??? నేనున్నా కదా నీతో పాటు!!! “ అని అన్నాడు“ బావ అమ్మాయికి పెళ్లి అయ్యాక అప్పగింతలు అంటే ఏంటో అనుకున్నాను కానీ మొదటిసారి అనిపిస్తుంది అమ్మ అత్త వాళ్ళ అందరూ నన్ను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంటే బాధగా ఉంది..... చదువుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా నాకింత బాధ అనిపించలేదు..... “ అని