ఇది మన కథ - 4

  • 7.9k
  • 3.2k

తను అలా నన్ను వదిలేసి వెళ్ళడం నేను తట్టుకోలేక పోయాను చాలా బాధ పడ్డాను .అయినా నన్ను ప్రేమించి అమ్మ కోసం ,నాన్న కోసం ,సమాజం కోసం అని ఎవడినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడం ఎంటి ..?నాకు ఏమి అర్ధం కాలేదు . అయినా నేను తప్పుడు మనిషిని ప్రేమించాను అని చాల ఫీల్ అవుతూ ఉన్నాను .అందరు ... ఆ బ్రహ్మ మనుషుల తల రాతలు రాస్తాడు అంటారు.కానీ నేను నా తలరాత నాకు నచ్చినట్టుగా రాసుకున్నాను.నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను.మనసుకు, మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది.మనసు నమ్మడానికి కారణాలు వెతకదు,కానీ మెదడు ఎప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది.మెదడు మనసు చెప్తే వింటుంది,కానీ మనసు తన మాటే తను వింటుంది.నేను తనని ఇష్టపడటానికి ఎప్పుడు కారణం వెతక లేదు.కానీ తనని మర్చిపోవడానికి కారణాలు వెతికాను.ఇష్టపడటం అనేది మనసుకు సంబందించినది,నమ్మకం మెదడుకు సంబందిoచినది.ఒక్కసారి నిజంగా