రాధామధురం

  • 10k
  • 3k

" ఎక్స్క్యూజ్ మీ మేడమ్!!! ఆర్డర్ ప్లీజ్!!!! " వెయిటర్ పిలుపుకి ఆలోచనల నుంచి తేరుకుంటూ అతన్ని చూసాను...సన్నగా నవ్వుతూ చూసాడు అతను నావైపు... నేను కూడా బదులుగా, బలవంతాన చిన్న నవ్వు నవ్వి, స్యాండ్విచ్ ఆర్డర్ చెప్పి, వాచ్లో టైం చూసుకున్నాను... అప్పటికే నేనొచ్చి పావుగంట అయ్యింది... కానీ అతనింకా రాలేదు... అసలు వస్తాడా!!?? అసలెలా వస్తాడే పిచ్చి మొద్దు... పన్నెండు ఏళ్ళు!!! సరిగ్గా పన్నెండు ఏళ్ళు అయ్యింది ఇప్పటికి....ఇన్నేళ్ళ తరువాత నువ్వు సడెన్గా కాల్ చేసి, కలవాలి అంటే నీకోసం రెక్కలు కట్టుకొని నీ ముందర వాలిపోడానికి, ఇప్పుడతనేమీ నీకోసం పడి చచ్చిపోయే రాధ కాదు... ఇప్పుడతనికంటూ ఓ కుటుంబం వుంది... భార్యా!!!! పిల్లలూ!!!!! అతని ప్రపంచం వేరిప్పుడు... " కానీ!!! ఒకప్పుడు నువ్వే ప్రపంచం కదా అతనికి... " నా మనసు సముదాయించింది నన్ను...అవును!!! ఒకప్పుడు నా రాధకు నేనే ప్రపంచం... పడి చచ్చిపోయేవాడు నేనంటే... లేదు