ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 7

  • 4.9k
  • 2.4k

పో అత్త నేను అలిగాను..... ఈ పూట నేను టిఫిన్ చేయను..... మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ వండి పెట్టు ఫుల్ గా తినేసి నిద్రపోతాను...... “ అని చెప్పి రూమ్ లోకి వెళుతూ ఉంటే@@@@@@రామ్ వెటకారంగా “ నాకు తెలిసే నువ్వు కచ్చితంగా మా మీద ఎక్స్పరిమెంట్ చేయడానికే టిఫిన్ వండావని!!!! అది తిన్న తర్వాత మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు!!!! మంచానికి వారాల తరబడి అతుక్కుపోతే ఎవరిది బాధ్యత???? నీ టిఫిన్ మీద మాకు రవ్వంత కూడా నమ్మకం లేదమ్మ సీతమ్మ..... “ అని అన్నాడుసీత హుహుహు అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మావయ్య అంటూ కాలిని నేలకేసి బలంగా కొట్టి “ చూడు మావయ్య వీళ్ళు నన్ను ఎలా వెక్కిరిస్తున్నారో!!!! “ అంటూ వీరేంద్ర గారి పక్కన కూర్చుని భుజం మీద వాలి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నాలుక బయటపెట్టి