ప్రేమాధ్యంతం - 1

  • 16.2k
  • 5.2k

యు బ్లేడీ!! నా ఊరికోచ్చి, నా సామ్రాజ్యంలోని రహస్యాలని అమ్మేయ్యాలని చూస్తావా?? ... గొంతు పట్టి ఒక్క ఉదుటున విసురుతాడు.ఐదు అడుగుల దూరంలో గాల్లో ఎగురుతు వెళ్లి కింద పడి గొంతు మీద చెయ్యేసి దగ్గుతున్న అతన్ని విసురుగా చేరి కాలు లేపి తన్నేవాడు కాస్త మరుక్షణం దవడలు బిగించి అలానే ఉండిపోతాడు.రక్తవర్ణాన్ని తలపించే అతని కళ్ళు, నరసింహాస్వామి ఉగ్రాన్ని చూపిస్తున్న అతని మోము, పిడికిలి బిగించి, ఆవేశంగా ఉన్న సింహం గాయం రుచి చూస్తే వచ్చే గర్జన శ్వాస..అక్కడంత నిశ్శబ్దం.ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న ఆ కొండప్రాంతం ఒక్కసారిగా స్మశాన నిశ్శబ్దన్ని పలికిస్తుంది.వందల మంది కొండజాతి జనుల సమక్షంలో ఆర్భాటంగా అవమానిస్తుంది అతన్ని ఓ అడవి తల్లి అందమైన కూన.అతని చెంప మీద పడిన చేతి వేళ్ళ అచ్చులు బహుశా అతనిలో మగాడి అహంకారాన్ని నిద్రలేపాయేమో...??ఒక్క ఉదుటున అతని పక్కనే భయంతో బిగుసుకుపోయిన ఆమె చేతిని పట్టుకొని లాక్కేలుతున్నాడు.విశ్వప్రయత్నలు చేస్తున్న