నిజం - 11

  • 4.7k
  • 2k

హాస్పిటల్ లో ఉన్న సాగర్ , మోహన్ , రామారావు మళ్ళీ బాబు ని చూడటానికి వచ్చారు . డాక్టర్ బాబు ని చెక్ చేసి అప్పుడే బయటకు వస్తూ వీళ్ళని చూసారు, బాబు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నడు , డోంట్ వర్రీ త్వరలోనే కోలుకుంటాడు , ఇక్కడ నర్సెస్ , డాక్టర్స్ జాగ్రత్తగా చూసుకుంటారు మీరు వెళ్ళండి , ఏదయినా అవసరం ఉంటే కాల్ చేస్తారు , రిసెప్షన్ లో మీ ఫోన్ నంబర్స్ ఇచ్చి అక్కడ ఇచ్చే ఫార్మ్స్ ఫిల్ చేయండి అన్నాడు డాక్టర్ , నేను ఇక్కడే ఉంటాను sir వద్దనకండి, బాబు ఒక్కడినే వదిలితే మరేదయినా ప్రమాదం జరుగుతుంది అని భయం గా ఉంది అని డాక్టర్ ని బ్రతిమాలాడు మోహన్ , సరే మీ ఒక్కరికీ పెర్మిషన్ ఇస్తాను పేషన్ట్ కి ఎలాంటి డిస్టబెన్స్ కలిగించద్దు , అని అక్కడి నుండి వెళ్లి