నిజం - 6

  • 4.3k
  • 2.1k

అన్నట్టు ఆ శరభయ్య భార్య గర్భవతా అడిగాడు విజయ్ రాఘవులు ని , అదేం లేదు sir వాడు 10 నెలలుగా ఇదే చెబుతున్నాడు , మీరు చూసారుగా తన పొట్ట ఏమి పెరిగి లేదు , అదంతా వాడి పిచ్చి వాగుడు అని మేము కూడా పట్టించుకోవటం మానేశాం , ఎవరైనా తిరిగి 10 నెలలు వచ్చాయి కదా అని అడిగితే 12 నెలలకు పురుడు వస్తుంది తను కనేది మామూలు బిడ్డ ని కాదు అని వితండ వాదం చేస్తాడు , వాడి పిచ్చి వాగుడు తో పాపం బయటకు రావడం మానేసింది ఆ సుజాత ,ఆ శరభయ్య మొదటి భార్య చనిపోయిన ఆరు నెలలకే తన కంటే 20 యేళ్లు చిన్నదయిన ఈ సుజాత ని పెళ్లి చేసుకున్నాడు అని శరభయ్య గురించి తనకు తెలినవి చెప్పాడు రాఘవులు , మాటల్లోనే శరభయ్య ఇంటికి చేరుకున్నారు ,