ఈ పయనం తీరం చేరేనా...- 18

  • 6.5k
  • 1
  • 3.3k

ముందుగా 1-18 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..ఇంటికి వెళ్ళిన అసద్ కి పర్వీన్, ప్రణయ్ లు ఎదురు పడతారు.. అసద్ నవ్వుతూ వెళ్లి పర్వీన్ నీ హగ్ చేసుకుంటాడు..పర్వీన్ నవ్వుతూ " కంగ్రాట్స్ నాన్న.." అంటారు ప్రేమగా.. అసద్ " థాంక్స్ అమ్మి.." అంటాడు.. ప్రణయ్ " నాకు తెలుసు రా నువ్వు వెళ్తే ఆ ప్రాజెక్ట్ నీకే వస్తుంది అని.. అందుకే నిన్నే పంపించా.." అంటాడు..దానికి అసద్ " అలాంటిది ఎం లేదు.. పెర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరికైనా ఈసీ గా వస్తుంది.. అందరూ వాళ్ల లాభాలు చూసుకున్నారు.. మనం హోనెస్ట్ గా ఇవ్వబట్టీ మనకి వచ్చింది.. అది నా వల్ల కాదు.. అయిన ఈ ప్రాజెక్ట్ నా వల్ల వచ్చిన నేను మాత్రం తన వల్లే వచ్చాను.." అన్నాడు ఏదో ఫ్లో లో..అసద్ మిత బాషి.. ఎక్కువ మాట్లాడడం అనేది జరగదు అలాంటిది