ఈ పయనం తీరం చేరేనా...- 16

  • 6.7k
  • 1
  • 3.3k

ఉదయం అసద్ లేచే సరికి అతని కుడి చెయ్యి బరువుగా అనిపించి లేచి కూర్చొని అటు చూసాడు.. తన చేతికి కట్టు కట్టి ఆ చేతిని తన రెండు చేతులతో బందీ చేసి పడుకుంది షివి.. అతని ఎడమ చేతితో అతని నుదురు తడుముకొని చిన్న నవ్వు నవ్వి.. ఆ చేత్తోనే షివి తల నిమిరి ఆ చేతిని ముద్దు పెట్టుకొని నెమ్మది తన చేతిని విడిపించుకొని తను లేచి చిన్న గా తన నిద్ర డిస్ట్రబ్ అవ్వకుండా లేపి మంచం మీద పడుకోబెట్టి తను లేచి ఫ్రెష్ అయ్యి ప్రణయ్ కి " లేచిన వెంటనే నాకు కాల్ చెయ్యి.." అని మెసేజ్ పెట్టీ వెళ్ళిపోయాడు అసద్...కొంచం సేపటికి పర్వీన్ వచ్చే సరికి తన మీద మేలి ముసుగు వేసి వుంది.. తన దగ్గరకి " అమ్మ ధరణి.." అని పిలిచింది.. రాత్రి ఆలస్యంగా పడుకోవటం వల్ల లేట్ గా