ఈ పయనం తీరం చేరేనా...- 8

  • 7k
  • 1
  • 3.9k

పర్వీన్ కి మాటలు రావటం లేదు... అసద్ " అమ్మి ..." అని పిలిచాడు పర్వీన్ వడిలో నుండి లేచి... అయిన పర్వీన్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా దైర్యం తెచ్చుకొని " అసద్ ఈ రోజు మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నాము... ఏమి చెయ్యాలో నీకు తెలుసు కదా..." అని అడిగారు...అసద్ కి కోపం వచ్చేసింది... కళ్ళు ఎర్రబడ్డాయి... పిడికిలి బిసుకుంది... ఏమి మాట్లాడకుండా లేచి అతని వీల్ చైర్ లో కూర్చొని వెళ్ళిపోయాడు... అసద్ ఏమి మాట్లాడ కుండా వెళ్ళే సరికి లోపల బాధగా వున్నా కూడా పనివాళ్లని పిలిపించి ఆ గది నీ అలంకరించి రమ్మని పురమాయించి వెళ్ళిపోయారు పర్వీన్...గది నుండి బయటకి వచ్చిన అసద్ గార్డెన్ కి వెళ్ళాడు... అక్కడ వీస్తున్న చల్ల గాలి నీ కూడా ప్రశాంతంగా ఆస్వాదించలేరు... అహ్వనించలేడు... అలాగే కళ్ళు మూసుకొని ' ఎందుకు అమ్మి నీకు అర్దం కావటం లేదు...