ఈ పయనం తీరం చేరేనా...- 4

  • 8.3k
  • 4.5k

ఇంట్లో ధరణి అమ్మ తాపీగా సోఫా లో కూర్చొని బయట గేట్ సౌండ్ కి వచ్చింది వీరూ నే అనుకోని " వచ్చావా... వచ్చి నా కాళ్ళు వత్తు.." అనింది.కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో లోపలికి తన తల్లి ముందు నిప్పులు కక్కుతున్న కళ్ళతో కల్చేసెల చూస్తుంది. ఆ టైమ్ లో ధరణి నీ అక్కడ ఊహించని తన తల్లి ఎక్కడ లేని ప్రేమంతా చూపిస్తూ " ధరణి ఇప్పుడైనా రావటం... వెళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అమ్మ..." అంది...ధరణి ఆవిడ వైపు చూసే చూపుల్లో ఎం మాత్రం మార్పు లేకుండా అలానే చూస్తూ... " మ్మ వీరూ ఎక్కడ...???" అని ఒకే ప్రశ్న అడిగింది.ధరణి చుపులోని, మాటలోని తీవ్రత చుసి ఒక్క క్షణం భయం వేసిన కూడా చూపు తిప్పేసి " వీరూ...వీరూ... హా... అది... వీరూ... బయట... పిల్లల్ల తో... హా... వీరూ పిల్లల తో ఆడుకోవటానికి వెళ్ళాడు...