ప్రేమమ్ - 3

  • 7.4k
  • 4k

అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయ్యి, 5 మినిట్స్ అయింది... ఈ బ్యాచ్ మొత్తం క్యాంటీన్లో, ఈరోజు వాళ్ళు విన్ అయిన మ్యాచ్ కోసం సొల్లు వేసుకొని ఇప్పటికి వచ్చారు... క్లాస్ లోకి ఎంటర్ అయిన బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఎదురుగా వున్న దృశ్యాన్ని చూసి...చాలా శ్రద్ధగా క్లాస్ చెప్తూ వుంది ప్రీతి... అంతకన్నా శ్రద్ధగా క్లాస్ వింటున్నారు స్టూడెంట్స్... చూపు తిప్పకుండా, కళ్ళను ఆమెకు అప్పగించేసి, ఏదో ట్రాన్స్లో వున్నట్టు వుండిపోయారు స్టూడెంట్స్ అంతా...జరుగుతున్నది మొత్తం చూసి, కీర్తి ముందుగా తేరుకుంటూ, " ఎక్క్యూజ్ మీ మ్యామ్... " చిన్నగా పర్మిషన్ అడిగింది...కీర్తి మాటలకు డిస్టర్బ్ అయిన ప్రీతి, కనుబొమ్మలు ముడిచి డోర్ వైపు తలతిప్పి చూస్తుంది...అంతమంది వున్నా ప్రీతి లుక్ అధర్వ్ మీదనే పడుతుంది ముందుగా... తరువాతనే మిగిలిన బ్యాచ్ మొత్తాన్ని ఒక లుక్ వేసి, చిన్నగా నిట్టూరుస్తూ ఎడమ చేతికున్న టైటన్ వాచ్ ని చూసుకుంటుంది..."