నా కలల నందనవనం. - 2

  • 5.9k
  • 2.8k

మీ నందనవనాన.....అడుగులో అడుగు జత చేర్చుతూ... సప్తపది శతకాలను మనసున పలుకుతూ...మోహన రాగాలు రవళిస్తున్నా వెన్నెల రేయిలో...నల్ల రాతి కళ్యాణ మండప మధ్య భాగామున...ఇరువురు ఒక్కరిగ ఒకరి చెంత ఒకరు చేరారు!!అతని చూపు తరంగంలా ఆమె చుట్టూ తాకుతూ తడబాటు గురి చేస్తుంటే. చెప్పలేని భావంతో అతని మీద చూపు నిలపలెని, ఆమె కనులు నేల వాలిపోతున్నాయి.నిండుగా విరగ కాస్తున్న, పండు వెన్నెల మండపం లోపలికి ఒక వంతు బాగం వరకు తొంగి చూస్తుంది.ఒకరికి ఒకరుగా సరితూగుతున్న ఆ ఇరువురిని చూడడానికి, తనని దుప్పటిలా కప్పుతున్న కారు మేఘాలను కట్ట కట్టి తరిమి కొట్టి, ముచ్చటగా వారిని చూసి మురిసిపోతుంది, నింగిన విరిసిన నిండు జాబిలి.చెలి చెక్కిలిపై పూసిన సంపంగి సిగ్గులు, వెన్నెల వెలుగులు పులుముకొని మెరిసిపోతుంటే... మైమరుపుగా చూస్తున్న అతని కన్నులకు సరికొత్తగా కనిపిస్తున్న ఆమె రూపం మోహన బాణాలను సంధిస్తుంది.అతని చేతిలో ఉన్న ఆమె చేతిని మరి కాస్త