నీడ నిజం - 26

  • 3.8k
  • 1.6k

“ నీలో మళ్ళీ కోమలను చూసి నేను కంగారు పడ్డాను . “ “కంగారెందుకు “? “......నీవు కోమల ప్రభావం లో నుంచి బయట పడేదెప్పుడు ? మనం ప్రశాంతమైన జీవితం గడిపెదేప్పుడు ? నా కేం తోచటం లేదు .” “జస్వంత్ చెప్పింది విన్నారుగా ? నాలో కోమలకు సామాజిక న్యాయం జరగాలి .అప్పుడే తనకు ముక్తి , నాకు విముక్తి .” “సామాజిక న్యాయమంటూ పెద్ద పెద్ద పదాలు వాడి మనల్ని భయ పెట్టి తన లక్ష్యం కోసం పావులుగా వాడుకున్టాడే మో . ?” “ఇదే పదం భరత్ అంకుల్ అంటే?” “ఆయన మన మంచి కోరే పెద్ద మనిషి ---పైగా డాక్టర్ . ఆయన మాటకు విలువ, గౌరవం ఉన్నాయి . “ “అందుకే ఆయనను కలవండి . మీ సందేహాలు తీర్చుకోండి . సమస్య నుండి బయట పడండి . “ అని జస్వంత్