జతగా నాతో నిన్నే - 17

  • 4k
  • 2.1k

గాలిలో వేగంగా ఎగురుతున్న ఒక హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ,ఒక పదాంతస్తుల భవనం పై ఏర్పాటు చేయబడిన హెలికాప్టర్ ల్యాండింగ్ పానెల్ పై ఆగింది . దాని రెక్కల నుండి వచ్చే గాలి శబ్దం , తుమ్మెద నాదముల మారుమోగుతుంది . దాని గాలికి చుట్టుపక్కల ఉన్న దుమ్ము రేణువులంతా దూరంగా నెట్టి వేయబడ్డాయి . అందులో నుండి కోటుని సరిచేసుకుంటూ, పాలిష్ చేయబడిన బ్రాండెడ్ బూట్లతో, రోలెక్స్ వాచ్ సరిచేసుకుంటూ కిందికి దిగాడు అతడు . అలా దిగగానే తనకి సెక్యూరిటీ కల్పిస్తూ ఇద్దరు సైనికులులాగా వచ్చి నిలబడ్డారు. వాళ్ళ చేతిలో రెండు పెద్ద గన్నులు ఉన్నాయి. చెవిలోని బ్లూటూత్ని నొక్కిపెట్టి " ఆ అమ్మాయి వివరాలు ఏమైనా తెలిసయా ?" అంటూ గంభీరంగా అడిగాడు . ఆ అమ్మాయి గురించి ఒక ఫోటో దొరికింది సార్ . మేము మీ క్యాబిన్లోనే వెయిట్ చేస్తున్నాను సార్ అంటూ భయపడిపోతూ