ఓం శరవణ భవ - 5

  • 2.6k
  • 1.2k

                                  మనసు చెదిరినట్లు నటించిన మహాదేవుడు  లిప్తకాలం మూడో నేత్రం కొద్దిగా తెరిచి  మన్మధుని వైపు దృష్టి సారించాడు .  ఆ స్వల్ప వీక్షణానికే సుమశరుడు భస్మావశిష్టమైపోయాడు .   ఈ ఘోరానికి తల్లడిల్లిపోయింది  రతీదేవి  శంకరుని  పాదాలపై పడి పతి భిక్ష ప్రసాదించమని వేడుకుంటుంది .  కరుణించిన కైలాసపతి  కన్నులు తెరిచి , ఇదంతా తన లీలా విశేషమని , ‘శుభ తరుణం’ సమీపించగానే  మన్మధుడు  పునర్జన్మ పొందగలడని  ఊరడించి పంపుతాడు .               తిరోగమించిన సుమశరం  హిమాలయము చేరి హైమావతి ఎదలో సున్నితం గా నాటుకుంటుంది .  తత్ఫలితంగా  ఆమె లో భావసంచలనం కలుగుతుంది .  మధుర భావనలతో  ఆమె ఏకాగ్రత కోల్పోతుంది .  ఈ పరివర్తనమునకు కారణమేమిటో