నీడ నిజం - 20

  • 3.9k
  • 1.8k

అజయ్ పెదవులపై చిరునవ్వు ‘ గొప్ప రాజవంశానికి ప్రతినిధి ‘ అన్న కామెంట్ మంత్రం లా పనిచేసింది . నిజానికి అతడి బలం, బలహీనత---రెండూ ఈ భావన లో నే ఇమిడి ఉన్నాయి . అతడి సంస్కారానికి , సంకుచిత మనస్తత్వానికి royal blood అన్న భావనే మూలం . అన్న విక్రం నుండి మంచి గుణాలు పుణికి పుచ్చుకు న్నాడు . జాత్యహంకారం తో మొండిగా, బండ గా తయారయినాడు . ఇంతలో రూపా దేవి వచ్చింది . భార్య గా పరిచయం చేశాడు . పేరుకు తగ్గట్లే ఆమె చాలా అందం గా ఉంది . చదువు, సంస్కారం ఉన్న మనిషి లా అనిపించింది . ఈ బండరాముడికి, దొండపండు లాంటి రూపా దేవికి జత ఎలా కుదిరిందా ? అని జస్వంత్ ఆశ్చర్యపోయాడు . “ ...... సతి నిస్సందేహం గా దురాచారమే . ఈ అభిప్రాయం