పరాంకుశరావు మాట తీరు , అనుభవం , హరీష్ రావ్ వివరణ వల్ల ప్రభుత్వ పరిస్థితి కుదుటపడింది. ముఖ్యమంత్రి ఊపిరి పీల్చుకున్నాడు.ప్యాంటు రావు ను అభినందించాడు. హరీష్ రావ్ ఇంటికి వెళ్ళి భార్యా భర్తల బాధ సిన్సియర్ గా పంచుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇంతియాజ్ ఛాంబర్ లో ఇంతియాజ్, ఆదిత్య, విహారి అన్వర్. అప్పుడు టైం పదకొండు. " నువ్వు, హ్యాకర్స్ మా కస్టడీ లోకి వచ్చాక రహీం ఒక్క సారి కూడా ఫోన్ చేయలేదు కదా. " ఎందుకు చేస్తాడు సార్ ? చేస్తే మీకు దొరికి పోతాడు. " ఇంతియాజ్ ఆలోచిస్తూ ఉండి పోయాడు." నిన్ను ముందు గానే అరెస్టు చేయకపోవడం మంచి దేరింది. కనీసం హ్యాకర్స్ ను పట్టుకోగలిగాం."" మరి మాస్టర్ మైండ్ మాటేమిటి ? వాడెవరో కనీసం రహీం కైనా తెలుసో లేదో ? వీడిక కన్పించడు. How to break this iron