ఆ ముగ్గురు - 40

  • 3.3k
  • 1.3k

తర్వాత వారం రోజులు గడిచాయి. అన్వర్ కోలుకున్నాడు. సమతా సదన్ కు మారాడు. డ్యూటీ కి మాత్రం వెళ్ళటం లేదు. యాకూబ్ సెలవు ముగిసింది. అతడికెందుకో వెంటనే వెళ్ళాలనిపించలేదు. ఈ లోపల రహీం ఫోన్ చేసి అన్వర్ కు జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. ప్రస్తుతానికి నెట్వర్క్ ఆగిపోయింది కదా అని అక్క నిఖా సాకుతో మరో వారం సెలవడిగాడు. రహీం కు ఒప్పుకోక తప్పింది కాదు. యాకూబ్ కు మరో వారం ఆటవిడుపు. ఇంతియాజ్ మిషన్ జన్నత్ డోనార్స్ లిస్ట్ జల్లెడ పట్టగా నలుగురు " suspected" గా తేలారు. రెండో వడబోత లోఇద్దరు తేలారు. ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉంది. ఒకరు ఆరిఫ్ ...... రెవెన్యూశాఖా మంత్రి షేక్ మస్తాన్ కా సాలా.మరొకరు ఆరిఫ్ కజిన్ ఫయాజ్.ఇద్దరినీ బాగా స్టడీ చేశారు.వారి దినచర్య ను గమనించారు. వారి ఫ్రెండ్స్ సర్కిల్స్ వివరాలు సేకరించారు. ఇదంతా యుద్ధ ప్రాతిపదికన జరిగింది.