ఆ ముగ్గురు - 25 - లక్కవరం శ్రీనివాసరావు

  • 4.2k
  • 1.6k

    తన పరిస్థితికి  కరువుతీరా  ఏడవాలనిపించింది  .  బాధను పంచుకునే నేస్తం అలీ దూరమయ్యాడు . రహీమ్ తన వింగ్ లీడర్ రోబో లాంటి వాడు .  బిజినెస్ తప్ప మరో విషయం మాట్లాడడు . అతడికి ఇచ్చిన శిక్షణ  అలాంటిది .  అన్వర్ ఇంటి వరకు వెళ్ళే సాహసం చేయలేదు . తల్లితండ్రుల మొహం చూసే ధైర్యం లేదు . పైగా తన మీద గట్టి నిఘా ఉంది . ఇంటికి వెళ్ళి  , తన ఉనికి డిపార్ట్మెంట్ కు తెలిసి తను పట్టుపడితే , తల్లిదండ్రులకు సమాజం లో స్థానం ఉండదు . తనకు జీవితమే ఉండదు . అందుకే ఆ ప్రయత్నం చేయరాదనుకున్నాడు . ఆ రోజు పెద్దగా పని లేదు .  సాయంత్రం వరకు  అడ్డదిడ్డంగా   ఊరంతా తిరిగి  అర్థరాత్రి ఇల్లు చేరుకున్నాడు .  విశ్వనాధ శాస్త్రి ఇంట్లో  శాస్త్రి, సునీత , అమల