ప్రేమ ప్రయాణం - 3

  • 20.4k
  • 8.7k

సంధ్య ప్రణయ్ ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళు వాళ్ళ పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా మారింది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా తిరిగేవారు. నేను, సూర్య ,వర్ష ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళం. వర్ష అందరితోకన్నా సూర్య తో ఎక్కువగా చనువుగా ఉండేది. ఎందుకంటే వర్ష డిగ్రీ లో జాయిన్ అవ్వక ముందు టైప్ ఇన్స్టిట్యూషన్లో సూర్య పరిచయమయ్యాడు. వర్ష వలనే సూర్య డిగ్రీ జాయిన్ అయ్యాడు. సూర్య జాయిన్ అవుతూ నన్ను కూడా జాయిన్ చేసాడు అందువల్ల వర్ష కు సూర్య అంటే మంచి అభిప్రాయం. వర్షిత మాత్రం కొంచెం దూరం నుండి వచ్చేది. తాను వర్ష వాళ్ల ఇంటికి వచ్చేది అక్కడ నుండి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం వర్షిత అందరితోనూ చనువుగా మాట్లాడేది. అందువలనేమో వర్షితని నరేష్ ఇష్టపడ్డాడు. కాని ఈ విషయాన్ని సూర్య ఒక్కడి తోనే చెప్పాడు నరేష్ .తనతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని ఎదురు చూసేవాడు. కానీ తాను మాత్రం