అరుణ చంద్ర - 9 - last part

  • 15.7k
  • 3.9k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 9 శ్రీరాజ్ అన్ని నార్మ్స్ని పుల్ఫిల్ చేస్తూ, అతి జాగ్రత్తగా, అతి పొందికగా, తన పేపర్స్ను సబ్మిట్ చేశాడు, కన్సర్న్పర్సన్స్కు, కొద్ది నిముషాల ముందు. పిమ్మట అతి సామాన్యంగా ఆ ఆఫీస్నుండి బయటకు వచ్చేశాడు.ఆ బయట, శ్రీరాజ్కై వేచి ఉంది, మధుమతి.శ్రీరాజ్ తను ఈ వేళటి ఈ ప్రొగ్రాంను ముందుగా మధుమతికి చెప్పి, తనను రమ్మనమని ఫోన్ ద్వారా కోరాడు, కృష్ణమూర్తి ప్రేరణతో. అందుకే మధుమతి రావడమైంది. ఆమె అందించగా అందుకున్న ఆ పేపర్స్ను శ్రీరాజ్ సబ్మిట్ చేయడమైంది. డన్ అన్నాడు శ్రీరాజ్, తన కుడి బొటన వేలును పైకెత్తి చూపుతూ. ఆల్ ఆర్ బెస్ట్ పేవర్ అంది మధుమతి, తనూ తన కుడి బొటన వేలును పెకెత్తి చూపుతూ.ఆ పిమ్మట, ఆ ఇద్దరూ, దగ్గరలోనే ఉన్న కాఫీ కేప్కులోకి నడిచారు. రెండు బ్లాక్ కాఫీ చెప్పింది మధుమతి. నీకూ ఆ బ్లాక్ కాఫీ ఇష్టమా అడిగాడు శ్రీరాజ్. ఉ.