అరుణ చంద్ర - 3

  • 11.7k
  • 4.4k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 3 ఆ రోజు రానే వచ్చింది.అరుణ తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్లారు, అక్కడ ఉంటున్న చంద్ర తల్లిదండ్రులును కలవడానికి. చంద్ర కూడా వస్తానన్నాడు. అందుకు వద్దన్నారు అరుణ తల్లిదండ్రులు.ముందుగా అనుకొని ఉన్నారు కనుక, ఎర్పోర్టుకు వచ్చారు చంద్ర తల్లిదండ్రులు.సులభంగా వాళ్లు అక్కడ ఒకరికొకరు మీటవ్వగలిగారు."నా పేరు శరత్" అని తొలుత పరిచయం చేసుకున్నాడు చంద్ర తండ్రి. ఆ వెంటనే, "ఈమె నా భార్య. శ్రావణి" అని తన భార్యను పరిచయం చేశాడు."నేను కృష్ణమూర్తి" అని పరిచయం చేసుకున్నాడు అరుణ తండ్రి. పిమ్మట, లక్ష్మిని పరిచయం చేశాడు.అంతా కలిసి, శరత్ కారులో వారి ఇంటిని చేరారు.కృష్ణమూర్తి, లక్ష్మి రిప్రెసై వచ్చేక, వారంతా హాలులో కూర్చున్నారు.శ్రావణి ఇచ్చిన కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు, ఉల్లాసంగా."ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీవి బ్రాడ్ మైండ్స్" అన్నాడు శరత్, కలివిడిగా."మీక్కూడా. మీవి కూడా" అన్నాడు కృష్ణమూర్తి, అదే రీతిన.అంతా చక్కగా నవ్వుకున్నారు."మన మధ్య ఏ