అరుణ చంద్ర - 2

  • 12.7k
  • 4.5k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 2 తమ గదిలో, మంచం మీద కుదుట పడి, పక్కనున్న కృష్ణమూర్తితో, ఉదయం అరుణకు విసెస్ చెప్పి, నాతో మా అన్నయ్య మాట్లాడేడు అని చెప్పింది లక్ష్మి. ఏమైనా విషయం ఉందా అని అడిగాడు కృష్ణమూర్తి. మాటల్లో చెప్పాను, అరుణకు ఈ యేడాది పెళ్లి చేయాలనుకుంటున్నామని. దానికి అప్పటి మీ మాటలు దొర్లించి నొచ్చుకున్నాడు. మరోసారి మీరు ఆలోచిస్తే బాగుంటుందన్నాడు అని చెప్పింది లక్ష్మి. వద్దు లక్ష్మీ. నాకు మేనరికాలు నచ్చవు. కనుకనేగా మా అమ్మాయి కోసం వేచి ఉండక, ఆయన కొడుకుకు బయట సంబంధాలు చూసుకోమని చెప్పింది. అదే ఉద్దేశ్యం ఉంటే, మా అక్క తన కొడుకుకు మన అమ్మాయిని ఇమ్మనమని, మన అమ్మాయి పుట్టినప్పుడే అడిగేసి ఉంది. అప్పుడే నేను కాదనేశానుగా. అని చెప్పాడు కృష్ణమూర్తి, కాస్తా చికాగ్గా.లక్ష్మి ఏమీ మాట్లాడలేదు.కొంతసేపు తర్వాత, లక్ష్మే, నిద్రపోతున్నారా అని అంది. లేదులే చెప్పు అన్నాడు కృష్ణమూర్తి. అమ్మాయి