అరుణ చంద్ర - 1

  • 16.8k
  • 1
  • 6.8k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 1 "శరణం శ్రీ షిర్డీసాయిబాబా" అని, మలి నమస్కారం చేసి, పూజా గది లోనించి బయటకు వచ్చింది అరుణ.హాలులో తన అమ్మ, నాన్న ఉన్నారు.వాళ్లు ఆనందంగా కనిపించారు.వాళ్ల కాళ్లకు నమస్కరించింది అరుణ, చిరునవ్వుతో."శుభమ్." అన్నారు ఆ తల్లిదండ్రులు, నిండుగా.అరుణ నిల్చోగానే, ఆమెను దరికి లాక్కొని, కౌగిలించుకుంటూ, ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఏక కాలంన, "పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లీ" అని అన్నారు.అరుణ, "థాంక్సండీ" అంది, హాయిగా.వెళ్లి, ముగ్గురూ డైనింగ్ టేబులు ముందు కూర్చున్నారు.టిఫిన్లు వడ్డించుకుంటూ, తింటూ, మాట్లాడుకుంటున్నారు, చక్కగా."ఇరవైఒక్క యేళ్లు గడిచాయి. గడిచిందంతా హాఫీయా" అని అడిగాడు అరుణను తన తండ్రి నవ్వుతూ. ఆయన కృష్ణమూర్తి. ఒక కంపెనీలో ఉన్నత ఉద్యోగి."చాలా బాగా నడుస్తోంది లైఫ్. మీ సహకారమే బోల్డు. థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా" అంది అరుణ చాలా హుషార్గా."థాంక్స్ ఏమిట్రా. నీ కృషి మంచిగా ఉంది. సో,