శ్యామల..సిగ్గు పడే సాహసం ఉందా - శ్యామల..సిగ్గు పడేందుకు సాహసం

  • 26.4k
  • 6.1k

అది ఒక మధ్య తరగతి కుటుంబం. సాయి లత ,మనోహర్ ఇద్దరూ భార్యా భర్తలు ... వీరికి ఒక కొడుకూ కూతురు,కొడుకు పేరు మిధున్ ఆరుద్ర , కూతురి పేరు లోక పావని. ఆమె చదువులో సరస్వతి,రూపం లో లక్ష్మి , సుగుణాలలో గంగి గోవు . ఇక ఆమె సోదరుడు మిధున్ ఆరుద్ర అభ్యుదయ భావాలు కలవాడు .... వీళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పని చేయడానికి వస్తుంది. చదువు అంతంత మాత్రమే, కానీ అందం లో లోక పావనికి ఏమాత్రం తీసిపోదు. పేరు శ్యామల తన చలాకీతనంతో కలుపుగోలుతనంతోఅందరి విశ్వాసాన్నీ అభిమానాన్నీ గెలుచుకుంది... మిధున్ ఆరుద్ర ఆమె స్వభావానికి ఆకర్షితుడవుతాడు. ప్రేమ లోపడతాడు కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచిస్తుంటాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. మనసులోనే మౌనంగా ఆరాధిస్తుంటాడు.ఇంతలో అనుకోని ఘోరం జరిగిపోతుంది... కూరగాయలు కొనటానికి బజారుకు వెళ్లిన శ్యామలను ఐదుగురు దొంగలు ఎత్తుకువెళ్లి మానభంగం చేసి పాశవికంగా హత్య