ఇద్దరు స్నేహితులు – సామ్రాట్ మరియు విశాల్. వీరి స్నేహం చిన్ననాటి నుండే అద్భుతంగా ఉండేది. ఒకరు మాట్లాడితే ఇంకొకరు అర్థం చేసుకునేంత అనుబంధం. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ, ఒకే బంచ్‌లో కూర్చునే వారు. సామ్రాట్ – చేసే పనిలో నిబద్ధత, ధైర్యం, సహాయం చేయడంలో ముందుండే వాడు. ఎవరికైనా అవసరం ఉంటే, "నేను ఉన్నాను" అని ముందుకొచ్చే గుణం. విశాల్ – తెలివి, మర్యాద, పరిజ్ఞానం కలిగిన వాడు. మాట్లాడే మాటల్లో మాధుర్యం, ఆలోచనల్లో లోతు. సమస్యకు పరిష్కారం చూపే తెలివి అతని బలము.
గాయమైన స్నేహం - 1
ఇద్దరు స్నేహితులు – సామ్రాట్ మరియు విశాల్. వీరి స్నేహం చిన్ననాటి నుండే అద్భుతంగా ఉండేది. ఒకరు మాట్లాడితే ఇంకొకరు అర్థం చేసుకునేంత అనుబంధం. వీరిద్దరూ పాఠశాలలో చదువుతూ, ఒకే బంచ్‌లో కూర్చునే వారు.సామ్రాట్ – చేసే పనిలో నిబద్ధత, ధైర్యం, సహాయం చేయడంలో ముందుండే వాడు. ఎవరికైనా అవసరం ఉంటే, నేను ఉన్నాను అని ముందుకొచ్చే గుణం. విశాల్ – తెలివి, మర్యాద, పరిజ్ఞానం కలిగిన వాడు. మాట్లాడే మాటల్లో మాధుర్యం, ఆలోచనల్లో లోతు. సమస్యకు పరిష్కారం చూపే తెలివి అతని బలము.ఒకరోజు ఊర్లో పండుగ. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో… అనుకోకుండా ఒక బాంబు పేలింది. ఆ శబ్దం క్షణాల్లో ఊరంతా చిదరబాదారైంది. అందరూ పరుగులు, అరుపులు, కన్నీళ్లు… ఆ గందరగోళంలో సామ్రాట్ మరియు విశాల్ విడిపోయారు.బాంబు పేలుడు తర్వాత గాయపడి, ఒంటరిగా ఉన్న సామ్రాట్‌ను ఒక పోలీస్ అధికారి రామచంద్ర గమనించాడు. అతని వయస్సు చిన్నది, ...మరింత చదవండి
గాయమైన స్నేహం - 2
అదృశ్యమైన మగవాళ్లు – సామ్రాట్ కథసామ్రాట్ అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో సంతోషంగా జీవించేవాడు. అతని జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుండేది. గ్రామంలో అందరూ గౌరవంగా చూసేవారు. అతనికి సహాయం చేయడం, సమస్యలు పరిష్కరించడం అంటే ఎంతో ఇష్టం.అతని నైతిక విలువలు, ధైర్యం, నిబద్ధత గ్రామ ప్రజలందరికీ ఆదర్శంగా ఉండేవి.ఒక శనివారం ఉదయం, సామ్రాట్ తన ప్రేమికురాలైన మధుతో కలిసి గ్రామం దగ్గర ఉన్న కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లాడు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, మధుతో నవ్వుతూ, ముచ్చటిస్తూ ఉన్న సమయంలో, అతని ఫోన్ మోగింది.ఫోన్ ఎత్తగానే, అతని పై అధికారిగా ఉన్న DSP రామలింగం ఆవేశంగా మాట్లాడాడు – "సామ్రాట్, ఇది అత్యవసర విషయం. గత రెండు రోజులుగా గ్రామం పరిసర ప్రాంతాల్లో మగవాళ్లు కనిపించకుండా పోతున్నారు. ఇప్పటివరకు ఐదుగురు మగవారు మిస్సింగ్ అయ్యారు. ఇది చిన్న విషయం కాదు. నీవు వెంటనే విచారణ ప్రారంభించాలి."ఓకే సార్! ...మరింత చదవండి
గాయమైన స్నేహం - 3
మాయలోని మానవత్వం.తదుపరి రోజు ఉదయం. సామ్రాట్ నిద్రలేచిన వెంటనే తన గుండె లోతుల్లో ఒక అస్పష్టమైన ఆందోళన. "నన్ను ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? నా అంతగా ఎలా తెలుసు?" అనే ప్రశ్నలు అతని మనసును కలవరపెడుతున్నాయి.అతను తన గత జీవితాన్ని తలచుకుంటాడు. చిన్నప్పటి స్నేహితులు, పాఠశాల రోజులు, పోలీస్ శిక్షణ, మొదటి కేసు… ఒక్కొక్కటి గుర్తుకు వస్తుంది. "నా చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఈ కుట్రలో భాగమై ఉండొచ్చు" అనే అనుమానం అతనిని మరింత లోతుగా వెతకమంటోంది.చీకటి నిశ్శబ్దంలో, సామ్రాట్ తన గదిలో కూర్చుని, దీని వెనక ఉన్న కుట్రను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో అతని మనసులో ఒక పేరు మెరుస్తుంది — విశాల్."నాకు తెలిసినంతవరకు, విశాల్ మాత్రమే నా లాంటి ఆలోచనలు చేసే, ధైర్యంగా వ్యవహరించే వ్యక్తి. అతను నా శిక్షణ కాలంలో నాకు స్ఫూర్తిగా ఉండేవాడు. కానీ... అతను చాలా కాలంగా కనిపించలేదు. ...మరింత చదవండి