ఆ వయసు కుర్రాళ్ళలా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు! ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు!! అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం! ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం!! వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండి ఉంటాయి. కానీ అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల ఆందాల మల్లెతీగలెన్నో అతనిని అల్లుకోవాలనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కానీ ఏ అమ్మాయీ అతని గుండె గదివరకూ రాలేదిప్పటివరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు కౌశల్. అపురూపమైన ఏ అపరంజి బొమ్మ అయినా అతనికి తారసపడినప్పుడు, అతని హృదయం క్షణకాలమైనా చలిస్తుందా, లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది అతనిని చూస్తే.

1

నీ కోసం -1

ఆ వయసు కుర్రాళ్ళలా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు! ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు!! అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య కోసం! ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం!! వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండి ఉంటాయి. కానీ అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల ఆందాల మల్లెతీగలెన్నో అతనిని అల్లుకోవాలనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కానీ ఏ అమ్మాయీ అతని గుండె గదివరకూ రాలేదిప్పటివరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు కౌశల్. అపురూపమైన ఏ అపరంజి బొమ్మ అయినా అతనికి తారసపడినప్పుడు, అతని హృదయం క్షణకాలమైనా చలిస్తుందా, లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది అతనిని చూస్తే. ...మరింత చదవండి

2

నీకోసం -2

ఊహించని సంఘటనలు జీవితంలో చోటు చేసుకోవడం, నా అన్న వాళ్ళు వదిలెయ్యడం ప్రణతికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నిజాన్ని తెలిసేలా చేసాయి. కేసు విచారణ ప్రణతికి మూడు సంవత్సరాల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం’ఇంటి దగ్గర లేటయింది’అంది ప్రణతి.’వీళ్ళకేం తెలుసు,నేను ఇక్కడికి రావడానికి ఎంతగా పోరాటం చేసానో’అనుకుంది మనసులో. ’అందరితో పాటూ వస్తే స్పెషల్ ఏముంది?అందరినీ కలిపి రాగింగ్ చేసేస్తాం,క్లాసులకి పంపేస్తాం.ఇలా సెపరేట్‍గా వస్తేనే ఈమెని స్పెషల్‍గా రాగింగ్ చెయ్యచ్చు.ఆ ఛాన్స్ మనకిద్దామనే ఈ పాప లేట్‍గా వచ్చింది.కదా పాపా?’వంకరగా నవ్వుతూ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్.అతన్ని చూసి అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో బెదురుని చూసింది ప్రణతి. అప్పటివరకూ అక్కడున్న అమ్మాయిలు,అబ్బాయిలు జూనియర్స్‍ని సరదాగానే రాగింగ్ చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదు.వినోద్ అక్కడికి రావడం అక్కడ ఎటువంటి పరిణామలు సంభవిస్తాయో అని వాళ్ళలో జంకు కలిగింది. వినోద్ ...మరింత చదవండి

3

నీకోసం -3

ఆఫీస్‍కి రెడీ అవసాగింది ప్రణతి.చిన్నప్పటి నుండీ కూడ అక్కలు వాడిన డ్రెస్సులే వేసుకునేది.దానికే ఆమెకి చాలా ఉక్రోషంగా ఉండేది. ఆ గదిలోనుండి తెచ్చి బెడ్ మీద బట్టల వైపు చూసింది. ఈ బట్టలు ఎవరివో బయటివాళ్లవి.వాళ్ళు ఎవరో ఎలాంటివారో తెలియదు,వాళ్ళు వాడి వదిలేసిన బట్టలు ఇప్పుడు ఆమె వేసుకుంటోది.కానీ ఇప్పుడు ఆమెలో ఉక్రోషం లేదు.జైలు జీవితం ఆమెకు నేర్పిన చాలా విషయాల్లో సర్దుకుని పోవడం ఒకటి.ఎంతో హుషారుగా ఉండే ఆమె ఇప్పుడు స్థబ్దుగా ఉంటోంది.బెస్ట్‍ఫ్రెండ్ అమృత్ గుర్తుకి వచ్చాడు.మనసులో కలిగిన బాధావీచిక కళ్ళల్లో నీటిబొట్టై నిలిచింది ప్రణతికి. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు మూడేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రోజు... డిశంబర్ ముప్పై ఒకటి! కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చాలా గ్రాండ్ పార్టీ జరిగింది.చాలా మంది ఫ్రెండ్స్ గేదర్ అయ్యారు.అంతా యూత్.అరుపులు,కేకలు,సంతోషం,సంరంభం ...మరింత చదవండి