మనస్సులో నిశబ్దం

  • 129

  మూసాపేటలోని ఆ అపార్ట్‌మెంట్ కారిడార్‌లో తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు మొదట వినిపించింది ఒక మహిళ కేక. ఆ తరువాత తలుపులు తెరుచుకున్న చప్పుళ్లు. పరుగులు. ఏడుపులు. పదినిమిషాల్లో అక్కడ జనం గుమిగూడారు. మరో ఇరవై నిమిషాల్లో పోలీసులు చేరుకున్నారు. ఫ్లాట్‌లోకి అడుగుపెట్టిన సబ్‌ఇన్‌స్పెక్టర్ విజయ్ కళ్ల ముందు కనిపించిన దృశ్యం మొదటి చూపుకు స్పష్టమైన ఆత్మహత్య కేసులానే అనిపించింది. పడకగదిలోని ఫ్యాన్‌కు చున్నీ కట్టబడి ఉంది. కింద పడిపోయిన కుర్చీ. గోడకు ఆనుకొని ఏడుస్తున్న బంధువులు. మంచంపై తెరిచి ఉన్న ల్యాప్‌టాప్. కానీ అనుభవం ఒకటి చెబుతుంది. నిజం ఎప్పుడూ మొదటి చూపులో కనిపించదు. మృతురాలు చందనా జ్యోతి. ఇరవై ఐదేళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వివాహమై రెండు నెలలే అయ్యింది. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ విజయ్ ఒక్కో అంశాన్ని గమనించడం ప్రారంభించాడు. ఫొటోగ్రఫీ. ఫింగర్‌ప్రింట్లు. ఫ్యాన్ ఎత్తు. చున్నీ ముడి. గదిలోని వస్తువుల స్థితి. ప్రతి వివరమూ