2“పిన్నీ….” అంటూ గోల చేస్తూ పరిగెత్తుతూ వచ్చారు శృతి వాళ్ల అక్క సంజన పిల్లలు…“హే! మీరు ఎప్పుడు వచ్చారు?” లోపలికి వస్తూ వాళ్లని ఎత్తుకుంటూ అడిగింది…“నిన్న నైట్ వచ్చాం… మాకు పొంగల్ హాలిడేస్ ఇచ్చారు… 10 డేస్ ఇక్కడే ఉంటాం…” చాలా ఆనందంగా చెప్పారు…వాళ్ల అమాయకపు మాటలకి నవ్వుకుంది శృతి… బుగ్గన ఒక ముద్దు ఇస్తూ…“అక్కా…” అంటూ చిన్నపిల్లలా వెళ్లి సంజనని హత్తుకుంది శృతి…“ఏంటే ఇది… రేపు పండగ అంటే ఈరోజు వస్తావా… కాస్త ముందు రావొచ్చుగా?” కొంచెం కోపం, కొంచెం ప్రేమతో అడిగింది సంజన…“రావాలనే అనుకున్నా… కానీ కొంచెం ఇంపార్టెంట్ టాస్క్స్ వల్ల కుదరలేదు అక్కా… అయినా లేట్‌గా వచ్చా కాబట్టి లేట్‌గా వెళ్తాలే…” చంటితనం, చిలిపితనం కలిపి చెప్పింది కళ్లుచిన్నవి చేస్తూ, తల ఆడిస్తూ…“సరేలే… కబుర్లు తర్వాత కానీ… వెళ్లి స్నానం చెయ్యి…” టవల్ చేతికిస్తూ కాస్త విసుగ్గా చెప్పింది అమ్మ…‘లేట్‌గా వచ్చా అని కోపం వచ్చిందా…. సారీ…’