త్రిమూర్తి - 1

అధ్యాయం – 1ఒక తల్లి కోరికబంగారు రంగు చీర కట్టుకున్న రమ్య తలపై ఎర్రటి గుడ్డలో ఏదో మూటను పెట్టుకుని వేగంగా నడుస్తోంది. ఆమె అడుగుల్లో అలసట ఉన్నా, మనసులో మాత్రం ఒకే ఒక కోరిక.వెనకాలే ఆమె భర్త కేశవ వస్తున్నాడు.“ఎందుకే నీకు ఇన్ని కష్టాలు? ఎవడు పుడితే మనకేంటి?” అని కేశవ విసుగ్గా అడిగాడు.రమ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది.“నీకు ఏం తెలుసు కేశవా? మా అన్నయ్య కొడుకులు ఆస్తి కోసం ఒకరినొకరు కొట్టుకుని చచ్చిన రోజులు నేను కళ్లారా చూశాను. నాకు పుట్టబోయే ముగ్గురు కొడుకులు అలా కొట్టుకుని చావకూడదు. అసలు ఆస్తి కోసం గొడవ పడకూడదు.”ఆమె గొంతులో బాధ పెరిగింది.“ఎలాగో మనకు ముగ్గురు పిల్లలు పుడతారు. మనం వాళ్లందరికీ సమానంగా ఆస్తి ఇవ్వలేకపోవచ్చు. కానీ... కనీసం వాళ్లందరికీ సమానంగా ప్రేమ ఇవ్వగలిగితే? ఆ ప్రేమతో వాళ్లు మన కోసం కొన్నాళ్లైనా కలిసి ఉంటారు.”కేశవ ఆమె