ఎవరో ఎక్కడో నుంచి సమాచారం సేకరిస్తున్నారు.కానీ ఎవరు?ఎలా?ఎందుకు?అతని మనసులో ఒక్కసారిగా ఒక పాత వీడియో మెదిలింది.హృదయపూర్వక ఆహ్వానం.రఘువరన్ వెంటనే ఆ వీడియోను మళ్లీ తెరిచాడు.అందులో ఉన్న స్వామీజీలను ఒక్కొక్కరిగా గమనించాడు.వారి మాటలు...వారి సమావేశాలు...వారి మధ్య ఉన్న సంబంధాలు...అన్నింటినీ జోడించడం మొదలుపెట్టాడు.అప్పుడే...అతనికి మరో ప్రశ్న వచ్చింది.“ఇంత పెద్ద నాటకం ఆడుతూ వాళ్లకు దక్కేది ఏమిటి?”డబ్బా?భక్తుల విరాళాలా?అది మాత్రమే అయితే ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు?అతను ఆలోచనలో మునిగిపోయాడు.---ఒక రోజు మార్కెట్‌లో టీ తాగుతూ నిలబడ్డాడు.పక్కనే కొంతమంది మహిళలు మాట్లాడుకుంటున్నారు.“మా ఊర్లో మహిమ జరిగింది.”“పుట్టలో నుంచి దేవుడి విగ్రహం బయటకు వచ్చింది.”“మా ఊర్లో అయితే ఒక ముసలాయన రోజూ కొంచెం కొంచెం మట్టి తీస్తూ చివరికి వినాయకుడి బొమ్మ బయటకు తీశాడట.”“మహిమే మరి!”రఘువరన్ చేతిలోని టీ గ్లాస్ ఆగిపోయింది.మహిమలు...ఒకటి కాదు.వేర్వేరు ఊర్లలో.వేర్వేరు దేవుళ్లు.కానీ ఒకే సమయంలో.అతని మెదడులో అన్ని సంఘటనలు ఒకదానితో ఒకటి కలవడం మొదలయ్యాయి.“ఏదో మిస్ అవుతున్నాను...”అతను గట్టిగా ఆలోచించాడు.“ఇది కేవలం డబ్బు