డాక్టర్ కాసేపు నిశ్శబ్దంగా రఘువరన్ వైపు చూశాడు.ఆ తర్వాత స్వల్పంగా నవ్వాడు."చాలు... ఇక నీ గురించి నువ్వు చెప్పడం ఆపు."రఘువరన్ ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూశాడు."నీ గురించి నాకు అర్థమైంది."డాక్టర్ కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ నెమ్మదిగా అన్నాడు."నువ్వు సాధారణ మనిషివి కాదు. ఓటమి ఎదురైనా దాన్ని కూడా ఎదుర్కొనే తత్వం నీలో ఉంది. పరిస్థితి ఎంత కష్టమైనా వెనక్కి తగ్గే వాడివి కాదనిపిస్తోంది."ఒక్క క్షణం ఆగి చిరునవ్వు నవ్వాడు."కాకపోతే... ఒక చిన్న తిక్క ఉంది."రఘువరన్ కనుబొమ్మ ఎత్తాడు."ఏంటది?""నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. కానీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం నేర్చుకో. లేకపోతే జనాలు నిన్ను మేధావి అనరు... పిచ్చివాడని అనుకుంటారు."డాక్టర్ లేచి తలుపు తెరిచాడు."లోపలికి రండి."ఆందోళనగా బయట ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వెంటనే లోపలికి వచ్చారు."డాక్టర్ గారు... మా అబ్బాయికి ఏమైంది?"డాక్టర్ చిరునవ్వుతో తల ఊపాడు."ఏమీ కాలేదు.""మీ వాడు పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడు.""కాకపోతే... అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొందరు ప్రపంచాన్ని