Super Brain - 2

డాక్టర్ కొద్దిసేపు ఆ యువకుడిని గమనించాడు.ఆ తర్వాత నర్సు వైపు తిరిగి,"రిస్ట్రెయింట్ బెల్ట్స్ తీసుకురండి."అని ప్రశాంతంగా చెప్పాడు.కొన్ని క్షణాల్లోనే మెత్తని లెదర్ బెల్ట్స్‌తో ఉన్న ప్రత్యేక వైద్య మంచాన్ని సిద్ధం చేశారు."భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక టెస్ట్."అని చెప్పి ఆ యువకుడిని మంచంపై పడుకోబెట్టాడు.తండ్రి, తల్లి కాస్త ఆందోళనగా చూస్తూ నిలబడ్డారు.డాక్టర్ తన జేబులో నుంచి వెండిరంగు చిన్న పెండులమ్‌ను బయటకు తీశాడు.అది నెమ్మదిగా యువకుడి కళ్ల ఎదుట ఊపుతూ..."నా వైపు మాత్రమే చూడు..."అన్నాడు.పెండులమ్ అటూ... ఇటూ... ఊగుతోంది."నువ్వు రిలాక్స్ అవుతున్నావు...""నీ కళ్లు బరువెక్కుతున్నాయి...""నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు..."ఒక నిమిషం...రెండు నిమిషాలు...మూడు నిమిషాలు...ఆ యువకుడు మాత్రం ప్రశాంతంగా నవ్వాడు."సార్...""నాకు నిద్ర రావడం లేదు."డాక్టర్ కనుబొమ్మలు ముడిచాడు."ఏంటి?""నా టెక్నిక్ పని చేయలేదా?"తనలో తానే గొణిగుకున్నాడు."పదిహేను సంవత్సరాలుగా ఈ పద్ధతితో వేలాది మందిని హిప్నోటైజ్ చేశాను."మళ్లీ పెండులమ్‌ను దగ్గరికి తీసుకొచ్చాడు."ఈసారి... మరింత ఏకాగ్రతతో చూడు."యువకుడు అలాగే చూశాడు.మరొక నిమిషం గడిచింది."సార్..."అన్నాడు అతను చిరునవ్వుతో."దీన్ని