Blaise me

  • 303
  • 129

బ్లాస్ me సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశమంతా ఎర్రటి వెలుగులు చిమ్ముతుండగా, ఇరువైపులా దట్టమైన అడవి మధ్యగా ఉన్న ఆ హైవేపై నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక కారు అత్యంత వేగంగా దూసుకుపోతోంది.డ్రైవింగ్ సీట్లో ఉన్న అంజు ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం, ఒక వింతైన ఆనందం కనిపిస్తున్నాయి. కానీ, పక్క సీట్లో కూర్చున్న రుద్ర పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. అతని ముఖం భయంతో పాలిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్లు కారు సీటును గట్టిగా పట్టుకుని, వణుకుతున్న గొంతుతో అన్నాడు..."వద్దు అంజు.. అంత స్పీడ్ వద్దు! ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది. ఆపు..."అంజు అతని మాటలు విని నవ్వింది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు, పైగా ఒక వింతైన ధీమా ఉంది."భయం వద్దు రుద్ర.. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఈ అందాన్ని చూడు!" అంటూ స్టీరింగ్ మీద నుంచి తన ఒక చేతిని తీసి, రుద్ర చేతిని గట్టిగా