Part - 19 సమయం : ఉదయం 10:15 గంటలువిజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంసిట్ కార్యాలయంలో ఏ.సి.పి అజయ్ తన కేబిన్‌లో ఒంటరిగా కూర్చున్నాడు. టేబుల్‌పై ఫైళ్లు తెరిచి ఉన్నా... అతని చూపు మాత్రం వాటిపై లేదు.నిన్న తెనాలిలో డాక్టర్ మాధవ్‌తో జరిగిన సంభాషణే మళ్లీ మళ్లీ అతని మనసులో తిరుగుతోంది.నెమ్మదిగా కుర్చీలో వెనక్కి వాలి కళ్లుమూశాడు. డా.మాధవ్ చెప్పినవి మళ్ళి గుర్తుచేసుంటున్నాడు.ఫ్లాష్ బ్యాక్"తెనాలి...ధన్వంతరి ఆయుర్వేద్ క్లీనిక్...డా. మాధవ్ కూర్చున్న చోట వున గోడపై వేలాడుతున్న పాత ఫోటోను చూస్తూ అజయ్ అడిగాడు.ఏ.సి.పి అజయ్ : డాక్టర్ గారు... ఈ ఫోటోలో ఉన్నది ఎవరు....?డాక్టర్ మాధవ్ తిరిగి ఆ ఫోటో వైపు చూశాడుడా. మాధవ్ : ఓ అదా..? ఆ ఫోటోలో ఉన్నది నేను నా ప్రక్కన నా స్నేహితుడు డా. రాఘవరావు. ఏ.సీ.పి అజయ్ : మరి ఆ మద్యనున్న పిల్లాడు..?డా. మాధవ్ : ఆ కుర్రాడు సాంబయ్య అని వియవాడకి 40-50