Part – 18సమయం : ఉదయం 10:50 గంటలుగుంటూరు – తెనాలి హైవేవిజయవాడ నుంచి తెనాలి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఏ.సి.పి అజయ్ కారు వేగంగా ముందుకు దూసుకెళ్తోంది.అతని మనసులో మాత్రం నిన్న రాత్రి చూసిన ఆ రెండు ఫోటోలు... మోహన్ చెప్పిన ప్రతి మాట... ఇంకా డా. మాధవ్ అనే వ్యక్తి చుట్టూనే ఆలోచనలు తిరుగుతున్నాయి.అంతలో...అజయ్ మొబైల్ రింగ్ అయింది.స్క్రీన్ మీద... "C.I. Praveen Calling..."అజయ్ బ్లూటూత్ ద్వారా కాల్ లిఫ్ట్ చేశాడు.ఏ.సి.పి అజయ్ : చెప్పు ప్రవీణ్...సీ.ఐ ప్రవీణ్ : సార్... మీరు చెప్పినట్టు అన్ని రికార్డ్స్ మళ్లీ క్రాస్ వెరిఫై చేశాను.ఏ.సి.పి అజయ్ : హ్మ్... ఏమైంది...?సీ.ఐ ప్రవీణ్ : డాక్టర్ రాఘవరావు గారు... శ్వేతకి లీగల్ గార్డియన్ మాత్రమే సార్.అజయ్ ముఖంలో చిన్న మార్పు.ఏ.సి.పి అజయ్ : దత్తత తీసుకోలేదా...?సీ.ఐ ప్రవీణ్ : లేదు సార్. ఫామిలి కోర్ట్ రికార్డ్స్, అనాధాశ్రమం రికార్డ్స్, స్కూల్