ఎవరు....? - 17

  • 234
  • 93

Part - 17సమయం : రాత్రి 8:40 గంటలువిజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆఫీసుఏ.సి.పి అజయ్ టేబుల్‌పై ఉన్న పాత ఫోటోను ఆ వ్యక్తి ముందుకు నెమ్మదిగా జరిపాడు.ఆ వ్యక్తి చూపు ఆ ఫోటోపై పడిన మరుక్షణమే...అతని ముఖంలోని రంగులు మారిపోయాయి.అతని చేతులు స్వల్పంగా వణికాయి.అజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అతని ముఖంలోని ప్రతి హావభావాన్ని గమనిస్తున్నాడు.కొన్ని క్షణాల నిశ్శబ్దం...చివరకు...ఏ.సి.పి అజయ్ : ఈ ఫోటోలో ఉన్న వాళ్లలో ఎవరెవరు మీకు తెలుసా మొహన్ గారు....? ఆ వ్యక్తి గొంతు ఎండిపోయినట్టుగా అనిపించింది.ముందు నీళ్ల గ్లాస్ తీసుకొని ఒక గుక్క తాగాడు.మళ్లీ ఫోటో వైపు చూసాడు.మోహన్ : డాక్టర్ మాధవ్ గారు...డాక్టర్ రాఘవరావు గారు...ఈయన డాక్టర్ అనిరుధ్ సేన్...మిగతా వాళ్లు అప్పటి క్యాంప్ స్టాఫ్ సార్..."అజయ్ తల ఊపాడు.ఏ.సి.పి అజయ్ : ఈ ఫోటో ఎప్పుడు ఎక్కడ తీసారో మీకు గుర్తుందా...?మోహన్ కొద్దిసేపు ఆలోచించాడు. వెంటనే గుర్తుపడతాడు.మోహన్: ఈ ఫోటో 1995 జూన్ నెల