మైత్రి వనం - 3

  • 455
  • 156

ఎపిసోడ్ 3: రహస్య వ్యూహం - సవతి చూపుల కరకుదనం!భాగం 1: మహారాజు రహస్య వ్యూహాలు... తండ్రి కొండంత అండ!అంతఃపురంలో దేవాసింహుడు వేసిన గండానికి మహారాజు తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ, అతని మనసులోని అహంకారం, కులగర్వం శాంతించలేదు."ఏ కులమో తెలియని ఆ అడవి బాలుడు నా రాజవంశానికి వారసుడు కావడం ఏంటి? నా ఏకైక కొడుకు దేవాసింహుడు వాడి కోసం రాజ్యాన్ని వదిలేస్తాననడం ఏంటి? ఎలాగైనా, దేవాసింహుడికి తెలియకుండా ఆ అడవి బాలుడిని ఈ రాజభవనం నుండి, ఈ రాజ్యం నుండి శాశ్వతంగా బయటకు పంపించేయాలి!"అని మహారాజు తన నమ్మకస్థులైన మంత్రులతో కలిసి రహస్య వ్యూహాలు రచించడం మొదలు పెట్టాడు. అంతఃపురంలో ఒక నిగూఢమైన కుట్రల వలయం అల్లుకుంటోంది.మరోవైపు, అవేమీ పట్టని యువరాజు దేవాసింహుడు తన ప్రత్యేక మందిరంలో తన ముద్దుల కుమారుడైన చిన్నారి విక్రమాదిత్యుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ బిడ్డ కళ్లల్లో ఉన్న దైవిక తేజస్సును చూస్తూ, మురిసిపోతూ ఇలా