ఎవరు....? - 14

  • 111

Part - 14సంజీవీని రూరల్ హెల్త్ ఫౌండేషన్ తాలుకు జూనియర్ డాక్టర్స్ హరీష్ మరియు పద్మ కనిపించడం లేదు అని విని సాగర్ వర్మ షాక్ అయ్యాడు.సాగర్ వర్మ : ఏం మాట్లాడుతున్నారు.? అలా ఎలా కనిపించకుండా మాయం అయిపోతారు.?ఎస్.ఐ సుందర్ : అవును సార్ శ్వేత మరణానికి సంబంధించిన ఫైల్ మొత్తం పరిశీలించాం.ఎస్.ఐ జాన్ బాబు : ప్రమాదం జరిగిన రోజు 2 గంటల ముందు వరకు డా. హరీష్ మరియు డా. పద్మ ఇద్దరూ శ్వేతతో కలిసి పనిచేసినట్టు రికార్డులు ఉన్నాయి.ఎస్.ఐ సుందర్ : కానీ ప్రమాదం జరిగిన తరువాత వాళ్ళిద్దరు ఎక్కడా కనిపించలేదు.సాగర్ వర్మ : అంటే..?ఎస్.ఐ జాన్ బాబు : సాక్షుల జాబితాలో గాని విచారణాధికారుల నోట్సులో గాని లేరు. సార్ఎస్.ఐ జాన్ బాబు : ఫౌండేషన్ తరువాతి రికార్డుల్లో కూడా పెద్దగా ప్రస్తావన లేదు.గదిలో మౌనం.సాగర్ వర్మ : ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు అక్కడే