అసంపూర్ణ కావ్యం - 9

బయట ప్రపంచంలో శారదమ్మ వెన్నెల కోసం కన్నీరు మున్నీరవుతుంటే, వెన్నెల మాత్రం తన ఊహల పల్లకిలో ఆ అందమైన ప్రపంచం వైపు ప్రయాణిస్తోంది. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న వెన్నెలకు కిషోర్ గతంలో అన్న ఆ చిలిపి మాటలు గుర్తొచ్చాయి. ఆ పాత జ్ఞాపకం గుర్తొచ్చి వెన్నెల పెదవులపై ఒక సన్నని, మౌనమైన నవ్వు మెరిసింది. కానీ బయట లోకం మాత్రం కన్నీటితో నిండి ఉంది. పదిహేను రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు, వెన్నెలలో చలనం లేదు. "నన్నూ వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా?" అని శారదమ్మ లోలోపల కుమిలిపోతోంది. తన భర్తను కోల్పోయిన ఆ తల్లికి, ఇప్పుడు వెన్నెల ఒక్కటే సర్వస్వం. తన దుఃఖాన్ని పైకి కనిపించకుండా దాచుకుంటూ, కూతురి నుదుటిపై చేయి వేసి "తగ్గిపోతుందిలే అమ్మా, ఏం భయం లేదు" అని ధైర్యం చెబుతోంది. కానీ శారద కు ఎవరు దైర్యం చెపుతారు!  లోలోపల తన కూతురిని ఎక్కడ కోల్పోతానో